Popular Posts

Tuesday, February 3, 2009

తెలుగు మెంటర్స్ :TELUGU MENTORS


ఒక్క నిమిషం.. ఇక్కడ ఆగండి..!!??

"ఉగ్గు పాలనుండి ఉయ్యాలలో నుండి అమ్మ పాడినట్టి భాష
తేనె వంటి మందు వీనులకు విందు దేశ భాషలందు తెలుగు లెస్స "

...ఈ విధంగా ఎంతో చరిత్ర కలిగి,ఘన వారసత్వం కలిగిన మన తెలుగును ...
పాశ్చాత్యులు కూడా "ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ " అని కీర్తించారు.
"సంస్కృతంబులోని చక్కెర పాకంబు - అరవ భాషలోని అమృత రాశి
కన్నడంబులో కస్తూరి వాసన -కలిసి పోయె తేట తెలుగునందు."
అని ఓ కవి పేర్కొన్నట్లుగా
ఇతర భాషలలోని విశిష్ట లక్షణాలను ప్రోది చేసుకొని
వేల సంవత్సరాలనుండి 'తెలుగు 'తన అస్థిత్వాన్ని నిలుపుకుంటున్నది.
మన రాష్ట్రంలో 'అమ్మ ,నాన్న' లకు బదులుగా 'మమ్మీ, డాడీల' సంస్కృతి రాజ్యమేలుతుంది .
"తెలుగు మాట్లాడే వారిని, తెలుగు మీడియంలో చదివేవారిని"
చిన్న చూపు చూసే దుష్ట సంస్కృతి నేడు రాజ్యమేలుతుంది.
ప్రపంచీకరణ నేపథ్యంలో రానున్న' 300 ల' సంవత్సరాల తర్వాత
ఎన్నో 'మాతృ భాషలు 'కనుమరుగవుతాయనేది ఓ సర్వే చెప్పిన చేదునిజం.
ఇంతటి సంక్లిష్ట పరిస్థితుల్లో ..అంతర్జ్యాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నెలకొల్పిన
ఆర్. జి.యు.కె.టి లో తెలుగు సబ్జెక్టును ప్రవేశపెట్టడం
నిజంగా మనమంతా గర్వించదగ్గ విషయం.
అమెరికాలో ఉన్నా మన తెలుగు పై మమకారంతో ఆర్. జి. యు. కె.టి. లో
తెలుగు ను ప్రవేశ పెట్టడానికి పెద్ద మనస్సు తో ఒప్పుకున్న ప్రొ!! రాజిరెడ్డి గారికి
మరియు ప్రొ.కె.సి.రెడ్డి గారికి, ఉపకులపతి ప్రొ.రాజ్ కుమార్ గార్కి
సహాయ సహకారమందించిన ప్రొ!! కుసుమా రెడ్డి గారికి
,డా!! మాలకొండా రెడ్డి గారికి... మరెందరో మహానుభావులు
..అందరికి హృదయపూర్వక నమస్సులు. ..
.ఈ బ్లాగ్ ముఖ్యోద్దేశ్యం మిత్రులారా! మనం ఎక్క డున్నా..ఎలాఉన్నా..ఏ పరిస్థితుల్లో ఉన్నా ..ఒకరితో ..మరొకరు .
.మన :పూర్వకంగా మాట్లాడుకోవాలని...వారానికి ఒక్కసారైనా..ఈ బ్లాగ్ లో కామెంట్సు రాయాలనీ.
.దీనిలో మీరందరూ పాలుపంచుకోవాలని .....
నా ఆశ....ఆశయం.,..........ఆకాంక్ష .........................
మీ 'తెలుగు 'మిత్రుడు : తూర్పింటి నరేశ్ కుమార్
"తరపి వెన్నెల ఆణి ముత్యాల సొబగు

పునుగు జవ్వాజి ఆమని పూలవలపు                                              " మా తెలుగు తల్లికి మల్లె పూదండ
మురళి రవళులు కస్తూరి పరిమళములు                                          మా కన్న తల్లికి మంగళారతులు ."
కలసి యేర్పడే సుమ్ము మా తెలుగు భాష."
                
---------'నండూరి '