Popular Posts

Monday, February 21, 2011

జి. తిరుమలేష్ కవితలు: ID:B092281

-గురువు ----------------------------------------
ఒక మల్లెపూవు వికసించి సువాసనలను విరజిమ్ముతూ వుంటుంది.
అలాగే ఉపాధ్యాయులు ఈ నేలపై ఉద్బవించి, జ్ఞానాన్ని  వెదజల్లుతూ
అప్పుడే వికసించిన విద్యార్థి జీవితానికి విద్యను నేర్పిస్తూ,
సక్రమైన క్రమశిక్షణను అలవరుస్తూ,
తల్లిదండ్రుల ముఖ్య పాత్రను పోసిస్తూ,
 మనలో కమ్మనైన ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ,
సక్రమైన మార్గాన్ని చూపిస్తూ, మన దేశానికే
భావి భారత పౌరునిగా తీర్చిదిద్దుతూ వుంటారు.
అలాంటి కమ్మనైన, మృదువైన హృదయం కలవారే ఉపాధ్యాయులు

జీవితంలో ఎన్నో విషయాలు మరచిన, నీకు విద్య నేర్పిన గురువును మరవకు సోదరా!

                                

  ----------------------  సైనికుడు -----------------------------

వందనం వందనం వీరజవానులకు ఇదే .....నా వందనం.
వందనం వందనం ఉగ్రవాదులను మట్టికరిపించిన
                         వీరజవానులకు ఇదే...... నా ప్రేమాభివందనం.
వందనం వందనం ఉగ్రవాదులను చీల్చడానికి....
వీర నరసింహంలా
                          దూసుకు వచ్చిన వీర కమాండోలకు .....ఇదే నా శుభాభివందనం.
                     వందనం వందనం దేశ ప్రజల ప్రాణాలు కాపాడిన,
                         వీరజవానులకు ఇదే .....
నా పాదాభి వందనం.
              వందనం వందనం అహోరాత్రులు మేల్కొని దేశాన్ని రక్షిస్తున్న
                          వీరజవానులకు ఇదే ...నా హృదయపూర్వక వందనం.

-----------------సమయం  ----------------------------------------

ఒక జీవిత ఖైదిని ప్రశ్నిస్తే, జీవితం విలువ తెలుస్తుంది.
పరీక్షలో తప్పిన విద్యార్థిని ప్రశ్నిస్తే, ఒక సంవత్సరం విలువ తెలుస్తుంది.
నెల జీతం చేసే వారిని ప్రశ్నిస్తే, నెల విలువ తెలుస్తుంది.
పొట్టకూటి కోసం పని చేసే వారిని ప్రశ్నిస్తే, ఒక రోజు విలువ తెలుస్తుంది.
ఉదయాన్నే లేచి పాలు అమ్మే వ్యక్తిని ప్రశ్నిస్తే, ఒక గంట విలువ తెలుస్తుంది.
రైలు మిస్సైన వ్యక్తిని ప్రశ్నిస్తే, ఒక నిమిషం విలువ తెలుస్తుంది.
యాక్షిడెంట్ జరిగిన వ్యక్తిని ప్రశ్నిస్తే, ఒక సెకను విలువ తెలుస్తుంది.
పరుగు పందెంలో రెండవ బహుమతి పొందిన వ్యక్తిని ప్రశ్నిస్తే, 

ఒక మిల్లి సెకను విలువ తెలుస్తుంది.
ఎప్పుడైతే మానవుడు సమయానికి విలువిస్తాడో, 

ఆ సమయమే అతనిని విలువైన వ్యక్తిగా తీర్చిదిద్దుతుంది.

------------చదువు -----------------------------------------------------------------
విద్యాలయం అనేది ఒక మహావృక్షం
ఈ వృక్షానికి ఉపాధ్యాయులు కొమ్మలాంటివారు
విద్యార్థులు మాత్రం ఆకులాంటి వారు
చదువు రాని వారు వాడిపోయిని ఆకులాంటివారు.

అందమైన బడి అనే కోవెలలో నాకు
చదువు కనిపిస్తుంది.
చదువు మనలో ఆత్మ విశ్వాసాన్ని నింపుతుంది.
చదువు మనలో  ధైర్యాన్ని సమకూరుస్తుంది.
చదువు  మనలో క్రమ శిక్షణను అలవరుస్తుంది.
ఈ క్రమ శిక్షణనే మన పెద్దలను గౌరవిస్తుంది.
చదువు మనలో మానసిక ఆనందాన్ని కలుగజేస్తుంది.

--------పల్లెవాసులు ----------------------------------------------------


జేజేలు జేజేలు పల్లె వాసులకు జేజేలు
జేజేలు జేజేలు పల్లెచందమామలకు జేజేలు
నాటి యుగంలో తరిగిపోతున్న సంస్కృతిని కాపాడే పల్లె అతీతులకు జేజేలు
జేజేలు జేజేలు ప్రపంచానికే ఆహారాన్ని అందించే పల్లె అన్నదాత
కు జేజేలు
జేజేలు జేజేలు 
పల్లె అప్యాయతలకు, మమతానురాగాలకు ప్రతిరూపాలైన, 
వారి మనస్తత్వాలకు జేజేలు ......
జేజేలు జేజేలు
పల్లె మనస్తత్వాలకు
 మంచు శిఖరాలకు జేజేలు
జేజేలు జేజేలు కష్టాలను, కన్నీళ్ళను ఓదార్పుగ భావించే వారి మనసత్వాలకు జేజేలు.
కావున
పల్లెటూరికి వెళదాం
మన సంతోషాలను, ఆనందాలను,
పల్లే వాసులతో పంచుకుందాం
కమ్మనైన అనంతమైన, ఙాపకాలను మూటకట్టుకుందాం
జీవితాంతం ఆనందంతో జీవించుదాం!
============================


2)విజయం
అపజయాలకు భయపడితే పొందలేము విజయం
ధైర్యమనేది మన జతగా వుంటే మనదే విజయం
ప్రతిక్షణం మన సాధనలో వుంది విజయం
మన సాధనమే ఆయుధమై  మనల్ని  గెలిపిస్తుంది.

3)తెలుసుకో సోదరా

మంచితనాన్ని ప్రేరేపించుకో
అన్యాయాన్ని ఖండించుకో
వికారాల ముల్లును తొలగించుకో
చెడుపై విముక్తిని కలిగించుకో
జీవితంపై ఆసక్తిని పెంచుకో
కష్టాలను సుఖాలను మధురంగా
స్వీకరించుకో
మన మంచి భవిషత్తుకే అని తెలుసుకో సోదరా! 


5)స్నేహం
మన జీవిత సింహాసానికి పట్టం కట్టించి
అందమైన భావాలపై అదుపు పెట్టించి
మన దివ్యగుణాల సవ్వడికి హారతి పట్టించి
మన ఆశయ దీక్షకు పదును పెట్టించి
మన వెన్ను తట్టి మన వెంట నిలిచేదె స్నేహం!

7)చిరునవ్వు


చిగురాకుల్లో చిరునవ్వు కనిపిస్తుంది
చిరునవ్వుల్లో ఉల్లాసం కనిపిస్తుంది
ఉల్లాసం మనిసిని ఉత్తేజ పరుస్తుంది
ఉత్తేజం మనిషికి ధైర్యాన్నిస్తుంది
ధైర్యం విజయాన్ని వరిస్తుంది
విజయంలో లక్ష్యం దాగి వుంటుంది
లక్ష్యం మార్గాన్ని సూచిస్తుంది
ఈ మార్గమే మన జీవితాన్ని నిర్ణయిస్తుంది

8)మన దేశం
మన భారతదేశం

మువ్వర్ణాల దేశం
మన భారతదేశం
మనకు జన్మనిచ్చిన దేశం మన భారతదేశం
ఎన్నో ఎన్నో భావాలతో కూడిన దేశం మన భారతదేశం
భిన్నత్వంలో ఏకత్వంగా పేరుగాంచిన దేశం మన భారతదేశం
కష్టాలకు కన్నీళ్ళకు ప్రతిరూపం మన భారతదేశం
ఎందరో సమర వీరులు పుట్టిన దేశం మన భారతదేశం

9)స్నేహం


కష్టాలకు కన్నీళ్ళకు ఓదార్పునిస్తుంది స్నేహం
స్నేహంకోసం నా ఆరాటము
ఈ స్నేహంలో కమ్మనైన సంతోషము
నా స్నేహితుల సంతోషమే నాకు ప్రతిరూపము
ఇక స్నేహమే నా జీవితము
అవును స్నేహము అనేది నా జీవితమే
జీవితంలో అన్నో విషయాలు మరిచినా!
ఈ స్నేహాన్ని మరువకు నా ప్రియమైన నేస్తమా!

10)గమ్యం


కోటి కష్టాలు ఎదురైన చేరుకోవాలి గమ్యం
గమ్యం కోసం నీవు చేయాలి పయనం
ఉంచకు ఆలోచనలకు మౌనం
మౌనం నీ చేత చేయిస్తుంది రణం
రణం అవుతుంది నీకు బారం
భారాన్ని చేసుకో దూరం
విజయం కోసం అలోచించు ప్రతిక్షణం
విజయం రాలేదని బాదపడకు ప్రతిదినం
నీ కృషిలోనే ఫలితం దాగి వుంటుంది ప్రియతమా!
ఆ తరువాతే నీ జీవితం అవుతుంది ఆనందమయం

12)చందమామ

చందమామ అందం
ముట్టుకుంటే మాసి పోయే చందనం
వర్ణించలేని అమోగం
మాటలకందని భావం
అంతులేని దూరం
మెరిసే మేలిమి బంగారం
కురిసెను పేదవాడికి ఆనందం
మనసును దోచే వైరాగ్యం
చిన్న పిల్లల మనసత్వం
అమ్మ గోరు ముద్దలకు ప్రతిరూపం
ఇదే ఇదే ఈ చందమామ ప్రత్యేకం

13)సమయం

జీవితంలో శాంతితో వున్నవారు
ఓర్పుతో సహనంతో జీవించేవారు
కమ్మనైన మాటలతో ఆకట్టుకొనేవారు
అందరితో కలసి మెలసి వున్నవారు
తొందరగా ఆవేశ పడనివారు
మంచి చెడును ఆలోచించి ముందడుగు వేసేవారు
సమయంతో పని చేసేవారు, ఏదైన సాధించగలుగుతారు
అని అంటోంది నా మనసు పలుమారు .

ఆకాశంలో మెరుపు మెరిసినా
కారుమెగాలు ఒకే సారి క్రమ్ముకున్న
ఈ నేలపై చురుగాలిలా వర్షం కురిసినా
రైతు గుండెలో మల్లె మొగ్గ వెలిసినా
జీవితం అనే రణ రంగం అగినా
సమయం మాత్రం ఆగునా
ఇలాంటి సమయాన్ని వృథా చేయడం మనకు
తగునా!
16)ప్రకృతి

ఆనందాన్ని కలిగించే కమ్మనైన నవ్వులతో
జీవితం సాగేది కష్ట సుఖాలతో
సముద్రం ప్రవహించేది ఆ అలలతో
ఆకాశం మెరిసేది ఇంద్రధనుస్సుతో
మనసు ఆనంద పడేది ఓ మంచిమాటతో
కష్టజీవి సంతోశ పడేది కష్ట ఫలితముతో
ఈ సృష్టి ఆనంద పడేది అందమైన ప్రకృతితోనే
కావున ఈ ప్రకృతిని కాపాడుదాం
ఈ అందమైన సృష్టికి ప్రాణం పోద్దాం!

17)ఇది ఎంత వరకు న్యాయం

కొమ్మల్లో రెమ్మల్లో జన్మించిన వారు
చీకటికి వెలుగుకు తేడా తెలియని వారు
ప్రేమానురాగాలు మరచిపోయిన వారు
తల్లి దండ్రుల ప్రేమను నోచుకొనని వారు
ఏ పాపం పుణ్యం ఎరుగని వారు
వారే అనాద పిల్లలు, ఇలాంటి పిల్లలకు జన్మనిచ్చి రోడ్డుపై వదిలి వెలతారే! ఇది ఎంత వరకు న్యాయమని నా మనసులోని ప్రతి భావన చెబుతుంది.

18)నాభావన

అందమైన చురుగాలి తనువంత తాకుతుంటే ...
నాలోని భావాలు పులకరిస్తుంటే,
జీవితంలో ఏదైన సాధించాలంటే
తగినంత కష్టపడాలని నా మనసంటే
కష్టపడి ప్రతి ఫలాన్ని పొందాలని నా బుద్ధి అంటుంటే
ఇక విజయాలే మీ సొంతుంటే ప్రపంచాన్నే జయించవచ్చని
 నేనంటుంటే!.

19)కదలండి కదలండి:-

కదలండి కదలండి ఙ్ఞాన సముపార్జనకై కదలండి
అందరు సేవా భావంతో మెలగండి.
కులమత భేదాలకు అతీతులు కండి.
విద్య అనే పదంతో ముందుకు సాగండి.
మీ జీవితానికి అనువైన
బాట ను వేసుకోండి
అపుడే మీ జీవితం
సార్థకం అవుతుందండి.





No comments:

Post a Comment