Popular Posts

Wednesday, March 2, 2011

పరమాత్మ కవితలు

                                   ఈ సృష్టిలో తీయనైనది అమ్మ ప్రేమయే... 


1అమ్మ
ఆదికి పునాది అమ్మ
అందుకే నాంది ఆడజన్మ...
అపురూపంగా చూస్తాడు బ్రహ్మ
అమ్మ పాలు అమృతం
అమ్మ పాట మధురాతి మధురం
ఆది గురువు అమ్మ ఆది దైవం అమ్మ
రాజాది రాజైన వీరాధి వీరుడైన ఒక అమ్మకు కొడుకే
అమ్మంటే ఆనందం అమ్మంటే ఆలయం
అమ్మంటే అద్భుతం అమ్మంటే వివేకం
అపురూపం అమ్మరూపం
అమ్మపంచు తన రక్తం అమ్మ పంచు తన జీవం
అమ్మ తెంచు పేగు బంధం
అమ్మ ఉంచు బిడ్డలపై అనంతమైన ప్రేమ బంధం
అమ్మకు ఎంతో రుణపడి ఉన్నాం మనం
అమ్మే మనకు ఆదర్శం అమ్మే మనకు మార్గ దర్శనం
అమ్మనిత్య నూతనం అమ్మ సత్య దర్శనం
అమ్మ ప్రేమకు ప్రతిరూపం
అమ్మ సహనానికి నిలువెత్తు నిదర్శనం
అమ్మ ఒక శక్తి స్వరూపం
అమ్మ ఒక సత్యం
అమ్మ ఒక అనంతం
సర్వం అమ్మమయం
నవమాసాలు మోసేది అమ్మ నవ దశాబ్దాలు మోసేది భూమాత
అమ్మను ప్రేమించు పూజించు
భూమాతను ప్రేమించినట్టే పూజించి నట్టే

2 యుగాది
ఆదికి పునాది ఉగాది
నవ వసంత దీపికల ఆశల పల్లకిది
షడ్ రుచుల సమ్మేళనమిది
మంచి చెడుల మమకారమిది
వికృతి నామ సంవత్సరం కావాలి శుభమది
జీవకోటి జనులందరికిది
నవ చరిత్ర సృష్ఠించడానికి నవశకానికి నాంది కావాలి ఉగాది
తెలుగువారి గుండె నిండుగ నిండగ గడప గడపన పండగ
కోటి ఆశల కోటి జనులకు కోట్ల కాంతులు వెల్లువిరియగ
సంతోశాలు ,ఉల్లాసాలు,ఉత్సాహాలు ఊతమీయగ ఊపిరీయగ
విస్వజగతికి విశ్వవిజయం
తెలుగువారికి అద్భుతంఇది అద్భుతం
నిరంతరం సంతోషమే పోటిపోటిన విజయమే
అందరికి కావాలి ఉగాది
మరువలేని మరిచిపోని మధురాతి మధురమైన జ్ఞాపకమిది
ఈ ఉగాది యుగ యుగాల ఒడిలలో అలరారిన యుగాది
తేవాలి దేశానికి నవవసంతదీపికల సమ్మేళనమిది

నాదేశం..భారతదేశం 

సర్వజనహితం అదే నాఅభిమతం                         
ఇదే హిందుత్వ అద్వైత సిద్ధాంతం
సకల మతాల సమ్మేళనం హిందుత్వం
సృష్ఠిపుట్టినపుడు పుట్టింది ఈ హైందవం
ఇది భార తీయ సంస్కృతికి చిహ్నం
విశ్వ జనహితం ఇదే వివేక సూత్రం
అల్లాను ఆధరించిన అద్భుత దయాగుణం ఇదిం హిందుత్వ అనికి సొంతం
క్రీస్తును ఆదరించిన గొప్పదనం ఇది హిందూదేశానికి సొంతం
విశ్వ వ్యాప్తం వేదాల సారం అద్భుతం గీతా సారం
జగములు మెచ్చిన భగవద్గీతకు జన్మనిచ్చిన జనని ఇది
రెండు రూపములకు అసలైన అర్ధంచెప్పింది ఈ హైందవం
గురుశిష్యుల బంధాన్ని పురివిప్పి చెప్పిన ఘనత
మన హిందూ దేశ చరిత
విశ్వంకన్నువిప్పనినాడే వేదంపలికిన ధరణి ఇది
ప్రపంచానికి జీవించడం తెలియని నాడే
సుసంపన్నమైన దేశంమన దేశంమనది
హిందుత్వం మతంకాదు భారత దేశం
హిందుత్వం భారత దేశ సంస్కృతి
హిందూ దేశంలో హిందువులు హిందువులం అని చెప్పుకోవడానిభయ పడుతున్న పరిస్థితి
ఇది ఓటు బాంకు రాజకీయాల దుస్థితి
3 మన భారత దేశం 
వందనం అభి వందనం నా భరత మాతకు వందనం
విశ్వజగతికి విశ్వమానవ విజయ సూచికి వందనం
నిత్య నూతన సత్య దర్శన ముత్యమా అభి వందనం
దేవభూమికి పుణ్యభూమికి హిందుభూమికి వందనం
కాశ్మీరం శిరస్సురా!పంజాబు హర్యానలు కంఠాలురా!!
రాజస్తాన్, ఉత్తర్ ప్రదేశ్ లు భుజ స్కంధాలురా!
గుజరాత్ అభయ హస్తం, ఈశాన్య రాష్ట్రాలు వామ హస్తం
కలకత్తా తీరప్రాంతం కొంగురా! భరతమాత కొంగురా!!
అమృత సరము కంఠహారము గాంధి నగరము గాజులు
భూపాళం వడ్డాణం కన్యాకుమారి కాళ్లురా తల్లికీ!!
హిందు మహాసముద్రంతాకి ధన్యం అవుతుంది
హిమాలయములు సిగల వెలసిన తెల్ల మల్లెలు తల్లికి
కాశ్మీర కుంకుమా సింధూర తిలకంబురా!తల్లికి
జమ్ము... శ్రీనగరమ్ము రా....రెండుకళ్లు తల్లికి
అందరిని ఆధరించే అహ్వానించే ఆకారంరా తల్లిది
అందుకే మనదేశం అందమైన అమ్మరా!!
ఇటువంటి దేశము ఈ భూప్రపంచములో లేదురా
ఈదేశంలోనే ఉన్నాం ఇది చాలురా!! ఈ జన్మకిది చాలురా!!
*పాటలు**
శ్రీ జై జ్ఞాన సరస్వతి మాత
ప** విద్యల నిలయం సరస్వతి మంత్రం
బుద్ధుల నిలయం గాయత్రి యంత్రం
జగతిలో అందరూ నేర్చేది ఈ ఏక సూత్రం
అందుకే అయ్యింది విద్య పవిత్రం
"విద్యల"
చ*అలనాడు నేర్చాడువిద్యలను వేద వ్యాసుడు వేదాలనే వ్రాసాడు
వాల్మీకి నేర్చాడు విద్యలెన్నెన్నొ విచిత్రంగ రాసాడు రామాయణమునే
విశ్వామిత్రుడు నేర్చాడు విద్యలనే సృష్ఠికి ప్రతి సృష్ఠి నిర్మించిన ఈ విశ్వ విజేత
అందుకే కలియుగాన విద్యేర మిన్న
"విద్యల"
చ** గాయత్రి దివ్య ధాత్రి మా సరస్వతి
త్రిలోకమ్ములో నిలిచావు త్రిలోకమాతవై
అంధకారములో ఉన్న జీవులకు వెలుగునింపుటకు వెలసినవు కలియుగాన
కమ్మని కధలలా కరుణించి కాపాడావు
రమ్మని పిలిచి మమ్మాదుకున్నావు
యెల్లప్పుడు మీదీవెన మాకుంటే చాలు
ఓం శివ శంకరాయనమః .....
ప**ఓం నమః హ్ శివాయ ఓంనమః ...శివాయ
ఓంకార నాదేశ్వరా విభూదే నామేశ్వరా
శివ శంకరా శుభకర దినకర ప్రభాకరా
కాపాడరా పరమేశ్వర మహేశ్వరా
"ఓంకార"
చ**అన్ని నీవే ఆనందం నీవే అనంతం నీవే అఖండంనీవే
అందరికి అండ దండ నీవే
సుఖమూ కష్టమూ బాధా గాధ అన్నీ నీవే ఆనందేశ్వర
నీరూపం మధురం నీ నామం మధురం
నీ స్మరణ యే మధురాతి మధురమూ
"ఓంకార"
చ**ఎంత చూసిన తనివితీరనిది ఈదైవ రూపం
కన్నుల క్రాంతుల తోరణం మనశివ రూపం సుందరం
కరుణాల వాల కరుణాకరా మహిమలు చూపించే మహిమన్వితా
కాపాడరా వర దేవరా శంభోశంకరా ఇది నీకేఅర్పితమూ
"ఓంకార"

ఆచార్య దేవో భవ
ప**గురువా గురువా వందనాలయ్యా
గురువేలేని విద్యేలానయ్యా
ఆన్నింటిలో మమ్ము ముందునడిపిరీ
కన్నీటిని రానివ్వక కనికరించిరీ
మరపురాని గురుతై నారయ్యా
"గురువా"
చ** శిలలా ఉన్న మాబ్రతుకులనీ శిల్పాలుగ మీరు చెక్కినారయా
అలలా ఉన్నా మా ఉప్పెననీ అక్షరాలుగ మీరు అల్లినారయా
చిరునవ్వుల ధరహాసంలో ముంచేసినారయ్యా
చిరునవ్వుల పరిహాసంలో తేల్చేసినారయ్యా
మీరే మాకు సర్వస్వమూ
"గురువా"
చ** సుడిగుండంలో ఉన్నామంటూ
దరికి చేర్చి దారి చూపిరి
ప్రేమకు రూపం నీప్రతి రూపం అనిమాకు ఇప్పుడే అర్ధమైందిలే
స్నేహాల విలువలు చెప్పిన స్నేహ శీలులు మీరయ్యా
జ్ఞానాల అర్ధంచెప్పిన జ్ఞాన రూపులూ మీరయ్యా
తుదకూ మీరే సర్వస్వమూ
"గురువా"
అంకెలలో భారత దేశం

1ఒకే మాట ఒకే భాణం ఒకే భార్య అన్న రామున్ని కన్నది నాదేశం
2రెండు రూపములకు(ఆడ,మగ)అసలైన అర్ధం చెప్పింది నాదేశం
3ముగ్గురు మూర్తుల దీవెన నాదేశం
4నాలుగు నాట్యాల సవ్వడి నాదేశం
5పంచ భూతాలతో నిండింది నాదేశం
6ఆరు ఱుతువుల ఆధరణ నా దేశం
7సప్త సరిగమల సుస్వర రాగాల అలలో చేసిన నాట్య విలాసం నాదేశం
8అష్టదిక్కులను అలికిన ఆనందం నాదేశం
9నవగ్రహాల అనుగ్రహంతో చేసిన విగ్రహం నాదేశం
10దశ అవతారాల దశ దిశలను చుట్టిన అల్ రౌండర్ నాదేశం 
                                                                                            
                                                                                 పరమాత్మ 
                                                       lamda - 2
            

No comments:

Post a Comment