Popular Posts

Tuesday, March 8, 2011

వేదన : తూర్పింటి నరేశ్ కుమార్

!!!!వేదన???
వేదన.....!!!!
       ------తూర్పింటి నరేశ్ కుమార్

          భూకంపపు  శిథిలాల్లో
              భూతకాలాన్ని నెమరేసుకుంటున్న
                        ఆశావాదిని నేను !

ఎండి వడిలిన  వృద్దాప్యంలో
బాల్యావస్థ   స్మృతులను
ఏటిఒడ్డున పగిలిన గవ్వల్లో
ఏరుకుంటున్న పసితనపు ప్రాయగాణ్ని...!!


 పురివిప్పిన మయూరంలా ఆడా లనీ .....
  లేడిలా చెంగు చెంగున గెంతాలనీ  ....

   వ్యాఘ్రంలా గాండ్రించా లనీ ....               
      అనుకున్నా నే చిన్నతనంలో ....!!!!


వేపచెట్టు నీడలో
ఎండిన ఆకుల దొంతర్లో
బిళ్ల్లం గోడులాడాలనీ జీవుని గోల!!


అధికారపు ఆంక్షలు,పెద్దరికపు నిబంధనలు
ఎన్నో మరెన్నో
కాలం కౌగిట్లో కట్టేశాయి!!!??
 

స్వేచ్ఛాయుత పిల్లగాలు లు తాకేసరికి
బాల్యంబంధించబడి
యవ్వనం బంధాల మయమై
హృదిని కట్టేశాయి
....
జీవన నౌకాయానంలో తెరచాపనయ్యాను.???

వడలి ,ముడతలు పడ్డకాయం
ధవళ రోమాలు ...

కాలం అద్దంలో అగుపించాయి ....
అంతరాత్మ వెక్కిరింపు
కన్నీటిబొట్ల సాక్షిగా
కన్పించాయవి  ప్రస్ఫుటంగా ...!!??

                                    -తూర్పింటి నరేశ్ కుమార్ 
                                   తెలుగు మెంటర్ 
                                      ఆర్.జి.యు.కె.టి బాసర

 

No comments:

Post a Comment