Popular Posts

Tuesday, March 15, 2011

స్వామి కవితలు :B092652

ఆలోచన....
సాగిపోయే మేఘానికి తెలుసు
తను ఎప్పుడు నల్లగా మారాలో
పుష్పించే ప్రతి పువ్వుకు తెలుసు
తను ఎప్పుడు అందంగా వికసిస్తుందో
పుట్టే ప్రతి మనిషికి తెలుసు
తను ఎపుడో ఒక్కప్పుడు పోవాల్సిందేనని
జనించే ప్రతి ఆలోచనకు తెలియదు
నిన్నెక్కడికి  తీసుకెళ్తుందో  ....
అందుకే మంచి ఆలోచల్ని కల్గివుండు ..... మిత్రమా......


2)ఉడికే ఉడుకు రక్తంతో
   యుక్త వయస్సు ఆవేశంతో.....
     నేనేమిటి ? ఈ బ్రతుకేమిటి ? అని...
         నా ఆత్మను ప్రశ్నించినపుడు
            ఏమి చేయాలి? మిత్రమా...??
3)
 ఎటో తెలియని ప్రయాణం.....
  ఏమిటో ? ఈ జీవన గమ్యం
    సంసార సాగరంలో పడి ఈదుతూ
      ఏదరి  చేరని ఈజీవనం నాకొద్దు
        ఒక్కసారైన ఈశ్వర సేవ కోసం
                  పూవులా మారాలని వుంది .... ఓ దైవమా....!

        ఆశ.. !!!!                          

అతిగా సంపాదించాలనే ఆశ...... దురాశకు దారి
   బెదిరించాలనే    ఆశ   .....  చంపడానికి    దారి
    ఆట పట్టించాలనే   ఆశ .....   అబద్ధానికి దారి
        సత్యంగా ఉండాలనే  ఆశ..... విజయానికి దారి


సత్యమే తన ప్రాణమై
ధర్మమే తన రక్షణయై
సేవయే తన ధ్యేయమై
నిస్వార్థం తన ఊపిరై
ప్రేమే తన  లక్ష్యమై ...

   జీవించే ప్రతి మనిషికీ
           దైవమే ప్రతి అడుగడుగున.....


        


12.  
                   ___:మనిషి :____
ఎందుకే మనసా ఎక్కడికో పరిగెడతావు
                 ఏదీ మనది కాదని తెలిసి ,
 ఎందుకే  శరీరమా పరితపిస్తావు నాది నాది అని.....
      నీవు జనించినప్పుడు తీసుకొచ్చింది ఏమీ లేదని తెలిసి
           ఎందుకే  సంసారమా పుట్టిస్తావు బంధాల్ని...
               ఏ బంధము నాతో రాదని తెలిసి.....!!!



 యుక్త వయస్సు
మలుపుతిప్పే యుక్త వయస్సులో
 మరుపురాని ఎన్నో అనుభూతులు
    ఏమిటా   ....?
        యుక్త వయస్సు అని అలోచిస్తే
          ఏదో తప్పు చేశానని మనస్సు
                 వేధించే ప్రశ్నల జల్లుల్లో....
   తొలకరి చినుకుల్లా కురిసే
         ఆనందాల హరి విల్లులు మరెన్నో.....!!!!!

                        అమ్మ...
.....
ఎలా  నిర్వచించగలం అమ్మా అన్న పదాన్ని
   నోటికి రాని మాటలతో , ఊహలకందని భావాలతో
      ఎన్ని భాష లున్న ఏం లాభం?
      పిల్లవాడి ఏడుపు   వినగానే వాడికేం కావాలో
           పసిగట్టే అమ్మ మనసు ముందు....

16
                    -----------జీవితం----------
ఎందుకో    నాకీ    జీవితం    వింతగా    కనిపిస్తుంది
    మురిపించే     మురిపాలతో
అందని ఆశయాలతో ,ఊరించే  ఆశలతో
తన   పయనం   మేఘంచాటు    భానుడిలా సాగుతుంది 
 సూర్యాస్తమయం కోసం
ఎన్నటికి దాన్ని చేరే అవకాశాలున్నాయో అని  ...??

ఎందుకో మళ్ళీ ఉదయించే సూర్యుడిలా
    జన్మించాలని ఉంది కొత్త ఊహలతో..............


                                                                                               G.Swamy(B092652) 
                                                                                          
                                                                                    class-Lamda-8


No comments:

Post a Comment