Popular Posts

Monday, March 28, 2011

గాది లక్ష్మీప్రసన్న కవితలు

గాది లక్ష్మీప్రసన్న కవితలు
*******************************

అమవాస్యలో  వెన్నెల   పంచినది
ఎడారిలో  సైతం   ప్రేమ వర్షం  కురిపించినది
తాను కరిగిపోతూ మనలో వెలుగును నింపినది
తనను తాను మరిచి మనమే తానుగా బ్రతికినది
పరమ పావనమై  స్వర్గాన్ని మించినది అమ్మ ఒడి
అయినా బిడ్డ ఆమెను  మరిచినది
కానీ ఎన్నటికి ఎండనిది ఆ అమ్మ... మమతల  జీవనది.!!!
***********************************
అమ్మ రెండక్షరాల పదం కాదు... 
అనంత జన్మల   పుణ్యఫలం.......
అమ్మ ఒడి    స్వర్గాన్ని     మించిన స్థలం ....
కష్టంలో     అమ్మ ఇచ్చే    ఓదార్పు    కొండంత బలం
అమ్మ ప్రేమ  ముందు    ఏదీ కాదు  స్వచ్ఛం 
అమ్మను అర్ధం చేసుకోలేకపోతే అది  నీ  దౌర్భాగ్యం ....
త్యాగం అమ్మ జీవితంలో    భాగం
ఆ అమ్మే లేకపోతే లేదీ జగం ..
ఇది మాత్రం   నిజం ...నిజం ....
*********************************
ఆప్యాయతల కోవెలలో    అనురాగ దేవత   అమ్మ
ఆ అమ్మకు మన  ఆనందాలే   .... అభిషేకం
మన సంతోషాలే  ...   శ్లోకాలు
మన ఆరోగ్యమే     ..హారతి
మన విజయమే.... నైవేద్యం
క్ర య విక్ర  యాలకు   తావులేనిది  అమ్మ ప్రేమ
త్యాగానికి  మారుపేరే ...అమ్మ ప్రేమ
ఆ ప్రేమను ఆస్వాదించగల్గడం ఒక అద్భుత అనుభవం

**********************************

ఉదయించే అరుణుడి కన్నా.... అధికంగా ప్రకాశించేది
వేణుమాధవుని వేణువు నుండి ...వెలువడే రాగం కన్నా విలక్షణమైనది
సుస్వరాల సరాగం కన్నా ....సొంపైనది
పరిమళించే పుష్పాల కన్నా.... సున్నితమైనది
సుగంధాల సువాసన కన్నా .....సుమధుర మై  నది
ప్రార్థించే   దేవుని కన్నా   పూజ్యనీయ మై  నది
అన్నివేళలా   నీ అభ్యున్నతిని   అభిలషించేది
అవనిలో అందరికీ అందనిది అమ్మప్రే  మ
అదే మన విజయానికి    చిరునామా
అట్టి అమ్మను ఎన్నటికీ    విడువకుమా.
***********************************

అమ్మా అని నువు పిలువక ముందే నీ అవసరాన్ని అర్థం  చేసుకునేది అమ్మ
ఆకలి అని నువు అడుగక ముందే    ...నీ ఆకలి తీర్చేది అమ్మ
నీ కష్టాలను తాను తీసుకుని తన సుఖాలను ...నీకు పంచేది అమ్మ
జీవితంలో నీకు అన్నీ ఇచ్చిన కాదు నీకు జీవితాన్నే ఇచ్చిన
మ్మకు అవసరమై  న సమయంలో నీవు అండగా వుండలేవా?
ఆ అమ్మ కోసం ఏమీ చేయలేవా?
ఇది నీ మనసులో కూడా  వున్న ప్రశ్న.
ఈ ప్రశ్నకు సమాధానం  వెతికే తరుణంలో
నీ నయనం ఒక్క అశ్రువైనా   రాల్చక మానదు.
**********************************
కష్టాలనే సూర్యుడు కలిగించే దుఃఖమనే ఎండలో  నీవు వున్నపుడు ,
అమ్మ అనే మేఘం ఓదార్పు అనే చినుకుల రూపంలో  నిన్ను చేరినపుడు,
నీవు పొందు ఆనందం ,అవధుల్లేని ఆకాశంలో విరిసిన అందాల  హరివిల్లు వంటిది.
అది అమ్మను కలిగి వున్నా అందరూ పొందలేనిది,
ఆ అమ్మ మనసును తెలుసుకున్నవారు  మాత్రమే పొందగలిగేది.
అమ్మా అని నువు పిలిచిన ప్ర  తిసారీ ఆఅమ్మ పొందే ఆనందం చెప్పలేనిదైతే ,
ఆ అమ్మ నిన్ను పిలిచినపుడు నువు బదులిచ్చే విధానం చెప్పరానిది.
అమ్మ లేని నీ బ్రతుకు వ్యర్ధానికే వ్యర్ధం.
ఆ విషయం గ్రహిస్తేనే నీ జీవితానికి పరమార్ధం.
అమ్మ ప్రేమను కొలవగల  కొలతల్లేవు.
అమ్మను వర్ణించగల  కవితల్లేవు,
వర్ణించడం సాధ్యం కాదు,ఆ అమ్మను అర్ధంచేసుకోవడానికి నీ జన్మే చాలదు.
**********************************
మన బరువును తన బాధ్యతగా మోసి
మన ప్రా  ణానికి తన ప్రా  ణాన్ని పణంగా పెట్టి
మన కోసం తన అనే భావాన్ని మరిచి,
మన విజయాన్నే తన విశ్వాసంగా
మన సంతోషాన్నే తన సంపదగా
మన ఆరోగ్యమే తన అందంగా భావించి
మన పుట్టుక నుండి తన మరణం వరకూ ఎల్లప్పుడూ
మన వెన్నంటి వుంటూ మన క్షేమాన్నిమాత్ర  మే కోరుకునే
ఏకై క మహామూర్తి   మన మాతృమూర్తి
అద్భుతం,అమోఘం,అఖంఢమై  నది ఆ అమ్మ ప్రే  మ
 అటువంటి అమృతమూర్తి   అనంతప్రే  మను
అందుకున్నవారి   అదృష్టం అపురూపం.
*******************************

మిలమిల మెరిసే మేను ....మేలిమి బంగారం తాను
సరిగాగలడా ఆ భాను కాదనగలడా ......ఆ అమ్మను
వేల విలువ   గలది     వెల  కట్టలేనిది
ఊహకు అందనిది      ఎక్కడా దొరకనిది
ఎన్నటికీ తరగనిది       అవనికే ఆది
అన్నిటికంటే గొప్పది    అట్టి ప్రే మ అమ్మది
*********************************

అమృత అంబుధి గలదు ...అమ్మ అను పదంలో
ఎక్కడ కనగలము అంతకన్నా అద్భుతం ఈ జగంలో
నిప్పులు కురిసే ఎండలో పువ్వుల వర్షం అమ్మ
తామసిని తొలగించగల వెన్నెల దీపం అమ్మ
తెలతెలవారు తెల్లని వేకువవేళలో తొలకరి తేనెల వాన అమ్మ
అమ్మలేనిదె లేదు ఈ అవని ఎన్నటికి విడువకు ఆ అమ్మని.
*************************************
అమ్మ కరుణ శక్తి                            

నిండిన మేఘం కురిసిన వర్షంలో ...  తడిసిన అనుభూతిని
ఎండనక వాననక కష్టిస్తూ......మెండై న  ప్రే మను
గుండెల్లో దాచుకుని అమ్మ పంచిన .....ఆదరాన్నెలా మరిచిపోతావు?
బండలను సై తం కరిగించగలదు ....అమ్మ కరుణ శక్తి
నీ అండదండలే అమ్మ ....నే కోరుకొను ముక్తి  ...!
ఇది ఎన్నటికీ మరువరాని సూక్తి..... !                                               
                                                  
                                                                                        

                                                                                                  
                                                                                                   గాది లక్ష్మీ ప్రసన్న
                                                                                                  
LAMDA 7
                                                                                                                                                                                                                                         

                                                                                                     

No comments:

Post a Comment