ఒక్క నిమిషం.. ఇక్కడ ఆగండి..!!??
"ఉగ్గు పాలనుండి ఉయ్యాలలో నుండి అమ్మ పాడినట్టి భాష
తేనె వంటి మందు వీనులకు విందు దేశ భాషలందు తెలుగు లెస్స "
...ఈ విధంగా ఎంతో చరిత్ర కలిగి,ఘన వారసత్వం కలిగిన మన తెలుగును ...
పాశ్చాత్యులు కూడా "ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ " అని కీర్తించారు.
"సంస్కృతంబులోని చక్కెర పాకంబు - అరవ భాషలోని అమృత రాశి
కన్నడంబులో కస్తూరి వాసన -కలిసి పోయె తేట తెలుగునందు."
అని ఓ కవి పేర్కొన్నట్లుగా
ఇతర భాషలలోని విశిష్ట లక్షణాలను ప్రోది చేసుకొని
వేల సంవత్సరాలనుండి 'తెలుగు 'తన అస్థిత్వాన్ని నిలుపుకుంటున్నది.
మన రాష్ట్రంలో 'అమ్మ ,నాన్న' లకు బదులుగా 'మమ్మీ, డాడీల' సంస్కృతి రాజ్యమేలుతుంది .
"తెలుగు మాట్లాడే వారిని, తెలుగు మీడియంలో చదివేవారిని"
చిన్న చూపు చూసే దుష్ట సంస్కృతి నేడు రాజ్యమేలుతుంది.
ప్రపంచీకరణ నేపథ్యంలో రానున్న' 300 ల' సంవత్సరాల తర్వాత
ఎన్నో 'మాతృ భాషలు 'కనుమరుగవుతాయనేది ఓ సర్వే చెప్పిన చేదునిజం.
ఇంతటి సంక్లిష్ట పరిస్థితుల్లో ..అంతర్జ్యాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నెలకొల్పిన
ఆర్. జి.యు.కె.టి లో తెలుగు సబ్జెక్టును ప్రవేశపెట్టడం
నిజంగా మనమంతా గర్వించదగ్గ విషయం.
అమెరికాలో ఉన్నా మన తెలుగు పై మమకారంతో ఆర్. జి. యు. కె.టి. లో
తెలుగు ను ప్రవేశ పెట్టడానికి పెద్ద మనస్సు తో ఒప్పుకున్న ప్రొ!! రాజిరెడ్డి గారికి
మరియు ప్రొ.కె.సి.రెడ్డి గారికి, ఉపకులపతి ప్రొ.రాజ్ కుమార్ గార్కి
సహాయ సహకారమందించిన ప్రొ!! కుసుమా రెడ్డి గారికి
,డా!! మాలకొండా రెడ్డి గారికి... మరెందరో మహానుభావులు
..అందరికి హృదయపూర్వక నమస్సులు. ..
.ఈ బ్లాగ్ ముఖ్యోద్దేశ్యం మిత్రులారా! మనం ఎక్క డున్నా..ఎలాఉన్నా..ఏ పరిస్థితుల్లో ఉన్నా ..ఒకరితో ..మరొకరు .
.మన :పూర్వకంగా మాట్లాడుకోవాలని...వారానికి ఒక్కసారైనా..ఈ బ్లాగ్ లో కామెంట్సు రాయాలనీ.
.దీనిలో మీరందరూ పాలుపంచుకోవాలని .....
నా ఆశ....ఆశయం.,..........ఆకాంక్ష .........................
మీ 'తెలుగు 'మిత్రుడు : తూర్పింటి నరేశ్ కుమార్
"తరపి వెన్నెల ఆణి ముత్యాల సొబగు
పునుగు జవ్వాజి ఆమని పూలవలపు " మా తెలుగు తల్లికి మల్లె పూదండ
మురళి రవళులు కస్తూరి పరిమళములు మా కన్న తల్లికి మంగళారతులు ."
కలసి యేర్పడే సుమ్ము మా తెలుగు భాష."
---------'నండూరి '
మిత్రులారా రండి రారండి
ReplyDeleteఈ బ్లాగ్ లో రాయండి ...వ్రాయించండి
ఈ బ్లాగ్ మీదే ...తెలుగు లో రాయండి
తెలుగు ను బ్రతికించండి...
మీ తూర్పింటి నరేశ్ కుమార్
hello naresh garu.your idia is very good.i am feeling very happy.plz inform this blog to our friends...........very very thank you
ReplyDeletehai naresh
ReplyDeleteతెలుగు తేజాన్ని..!
ReplyDeleteమిత్రమా!ఈ బ్లాగును గూర్చి వర్ణించలేను..!
ఈ విజ్ఞాన వినోద వినువీధులలో విహరించకుండా వుండలేను...!
ఈరోజు నాకు మధుర స్మృతి..!
అజ్ఙాన తిమిరాన్ని తరిమివేసిన గర్వస్మృతి..!
నేను చూశాను నిజంగా..! తెలుగు తల్లి వెలుగుల ప్రతిబింబాన్ని..!
తల్లిభాషకై తపిస్తున్న తెలుగు మెంటర్ల వైనాన్ని..! ధైర్యాన్ని...!
నేనుచూశాను నిజంగా...!
త్రిబులైటీలో జరుగుతున్న ఆధునిక తెలుగు బోధన శిక్షణని..!
తెలుగుతల్లి రక్షణని...!
నేను చూశాను నిజంగా...!
రాజసం ఉట్టిపడే తెలుగుతల్లి ముద్దుబిడ్డ రాజిరెడ్డిగారి విజ్ఞానాన్ని..!
తెలుగు సుమపరిమళాలు పంచుతున్న కుసుమారెడ్డిగారి జిగేలుమనే తెలుగు తేజాన్ని..!
నీతిమాటలమూటలను పద్యాలుగా అల్లిన మాలకొండారెడ్డి గారి పాండిత్యాన్ని..!
కంటిచూపులతో కార్యాలను చక్కదిద్దే విభామేడంగారి వైజ్ఞానిక నిర్ణయాల్ని...!
నేనుచూశాను నిజంగా...!
తెలుగు పలుకులను, నుడికారాలను ఉడికించి, అలం (అల్లం) కారాలను అంటించి
లాపుటాపుల వీపులపై టపటపవాయిస్తున్న తెలుగుమెంటర్ల మేథో శక్తినీ, యుక్తిని..!
నేడు నేను ఏకాకినికాను...!
వసంతంలో కూసే మధుర కోకిలను..!
వినువీధులలో విహరిస్తూ తెలుగు మిత్రులను, శత్రులను పలకరిస్తాను..!
కమ్మని తెలుగుమాటలను నా మధుర గళంతో వారికి వినిపిస్తాను...!
విశ్వమంతా తెలుగు మాధుర్యాన్ని నా కలంతో, గళంతో మారుమ్రోగిస్తాను....!
తెలుగు సాహిత్యంలోని హితాన్ని తన్ని ప్రతిఒక్కడికి వినిపిస్తాను...!
కమ్మని కథల్లోని నీతులను నీతినియమాలు లేనివారి నెత్తిన గుమ్మరిస్తాను...!
తెలుగుతల్లిని రక్షించుకునే మార్గాలను అన్వేషిస్తాను...!
గురజాడ అడుగుజాడలలో అడుగువేస్తూ నడుస్తాను...!
అమృతం కురిసేరాత్రిలో కృష్ణశాస్త్రితో ఆడి,పాడి, తడిసి ముద్దనవుతాను...!
భానుని అమృత కిరణాలను నాలోనింపుకొని విజయపథమ్ము వైపు దూసుకెళ్తాను...!
జగన్నాథ రథచక్రాలను ఆంగ్లభాషావ్యామోహుల హృదయాలపై పరుగెత్తిస్తాను...!
నేడు నేను నిగర్వినైనాను...!
తెలుగును ప్రేమిస్తాను...!
ఆరాధిస్తాను...!
అనుసరిస్తాను...!
అందిస్తాను...!
శ్వాసిస్తాను...!
తెలుగు 'వాడినై '...!
జీవిస్తాను.....!
hi friends how r u? how is ur job....
ReplyDeleteMOGILI CHANDRA SHEKAR
hi good norning
ReplyDeletehi fri....
ReplyDeletenesthamaa..
ReplyDeleteee blog chaalaa baagundi.
nesthamaa..
ReplyDeleteee blognu maruvakandi.
diinini mariste mana ammanu marachinatle.
ammanu , amma blognu gurthunchukundamu.
wish you happy christmas.
ReplyDeleteblog superb sir !
ReplyDeleteI think your working on blogs
ALL THE BEST SIR