" దరికి రాని దరి దరిచేరినది"
------ సిరికొండ మాధవి
నా ప్రపంచం కాని ప్రపంచంలో అడుగుపెట్టాను.
అదే మా స్కూలులో. అక్కడ నాకు ఎదురుపడేవి అన్నీ తెలిసిన మొహాలే.
కాని ఒక్కరూ పలకరించరు. .....అందరూ సుపరిచితులైనను అపరిచితులు.....!!!!
అందరిలో నన్ను పలకరించేవి........ పచ్చని చెట్లూ....సీతకోకచిలుకలూ
... నా భుజం మీద ఎప్పుడూ వాలే వేపాకులూ....... నాకెంతో ఇష్టమైన నా స్కూలులోని
డిసెంబర్ పూలూ>>>>> వాటి స్నేహితులైన తేనెటీగలు.,,,,, ఇదే నా లోకం.
బహుషా! నా ప్రపంచంలోని మాట్లాడగల్గే వాళ్ళు ఎవ్వరూ నాతో మాట్లాడరు.
రేపు ఆగష్టు ౧౫ రోజు.
నాకిష్టమైన నారింజ, తెలుపు, ఆకుపచ్చ రంగుల జెండాలతో నిండింది .
నాకిష్టంలేని నా స్కూలు. కొందరు జెండాలు అందించడం, కొందరు అతికించడం చేస్తున్నారు.
నా రాకతో కొంతనైనా విరామం జరగలేదు వాళ్ళ పనిలో...మా తరగతిలోకి అడుగిడాను.
ఎవ్వరూ నా వైపు కన్నెత్తి చూడలేదు.
మా తరగతిని తీర్చిదిద్దడంలో , అలంకరించడంలో నాకు భాగం ఇవ్వాలని వాళ్ళకి తెలియదో, తెలిసినా తెలియనట్టు నటిస్తున్నారో నాకు తెలియడంలేదు.
నా స్థానాన్ని (తరగతిలో, ప్రపంచంలో) నేను గుర్తుకు తెచ్చుకుని నేరుగా ఒక మూలన ఉన్న బల్లపై కూర్చున్నాను. ఆ బల్లపై ఒక మెరుపుతీగ నాకు మాట్లాడుతున్నట్టుగానూ, నన్ను పలకరిస్తున్నట్టుగానూ వుంది. దాన్ని నా చేతిలోకి తీసుకొని నేత్రానందం పొందుతున్నాను.
ఆ మెరుపుతీగ రంగురంగులతో నిముషానికి ఓ విధంగా మారుతూ ఆకర్షిస్తుంది.
ఇంతలో నాతో స్నేహం చేయని స్నేహితురాలు వేగంగా వచ్చి వడిగా లాక్కొని వెళ్ళింది.
ఈ క్షణికానందానికి కూడా నేను అర్హురాలిని కానేమో!!!!!!!!
నాలో లోపం గురించి ఆలోచించుకుంటే నాకే తోచదు.
అందరూ నాతో మాట్లాడతారు. కానీ మనస్ఫూర్తిగా కాదు.
అందరూ నాతో ఆడతారూ, పాడతారు. కానీ మనస్సాక్షిగా కాదు.
నాతో బావుండి చాటుగా అనుకున్నా పర్లేదు.
కానీ నా మొహం మీద కొట్టినట్లు మాట్లాడతారు. నాకెంత బాధేస్తుందంటే నన్ను నేను చంపుకోవాలన్నంత. కానీ వాళ్ళందరికీ ఆదర్శంగా వుండి నన్ను నేను నిరూపించుకోవాలనుకుంటున్నాను.
అదే నన్ను ఎపుడూ ఆపుతూ వుంటుంది.
ఏదో ఒక రోజు వారికి నన్ను నేనుగా నా ప్రతిభను చూపిస్తాను.
వారిని అబ్బురపరుస్తాను. అప్పుడైనా వారి స్నేహాన్ని, అభిమానాన్ని పొందుతానేమో. కానీ ఒక్కోసారి అనుమానం వస్తుంది.
నిజంగా, ఈ లోకం ఎంత విచిత్రమైంది.
ఉదయించే సూర్యుడికి నమస్కారం చేస్తూ, అస్తమించే సూర్యుడు వైపు కూడా చూడరు.
అందమనేది చూసే కళ్ళను బట్టి ఉంటుంది. ఒక్కొక్కరికి ఉదయం ఇష్టమైతే, ఒక్కొక్కరికి రాత్రీ, కటిక చీకటి ఇష్టమవుతుంది.
నల్లగా ఉన్నంత మాత్రాన చీకటిని అసహ్యించుకోలేము కదా!
చీకటి ఎన్నో విజయాలను తెచ్చిపెట్టింది. ఉదాహరణకు మన స్వాతంత్ర్యం.
ఇవన్నీ ఆలోచిస్తూ ఇంటి దారి పట్టాను.
ఇంత గాఢంగా ఆలోచిస్తున్న నా మనసును హఠాత్తుగా మలిచింది ఓ సన్నివేశం.
ఒక మూర్ఖుడు, నీచుడు, పురుషాహంకారుడు అయిన ఓ వ్యక్తి, మనిషి అనడానికి అర్హుడు కాడు. వాడు ఒకావిడను రెండు దుడ్డుకర్రలతో బాదాడు. ..
ఇంకనూ ఆగక కాలితో తన్నాడు. .....ఆమెలో నేను విప్లవాన్ని ఆశించాను.
ఆదిశక్తిగా మారుతుందనుకున్నాను. కానీ ఆమె కళ్ళు అసహనాన్ని ప్రదర్శించాయి. ఏమీ చేయలేని నిస్సహాయురాలుగా కనిపించింది. 'నా కళ్ళలోంచి నీళ్ళు అసంకల్పితంగా రాలాయి'. నా మనసు నా చెంపపై చెల్లుమని చెంపదెబ్బ కొట్టింది. ఒక్క ఉదుటున కోలుకున్నాను. చుట్టూ వినోదం చూస్తున్న జనాన్ని చూసి నా కళ్ళు నిప్పులు కక్కాయి. నా జీవితం మీద నాకే విరక్తి కలిగింది.
దాన్ని ఆపాలని నా మనసు ఉద్వేగంతో మండుతుంది.
నన్ను నేను ఆపుకోలేకపోయాను.
కానీ నా ఆటో శరవేగంతో వెళ్ళడంతో ....నిస్సహాయస్థితిలోకి వెళ్ళిపోయాను.
ఈ సంఘంలో ఇన్ని సంవత్సరాలు గడిచినా ఆడదానికి ఇంకా గౌరవం లేకుండ పోయింది.
ఆడది ఎన్నో ఘోరాలను సహిస్తుంది.
అందరినీ, తను నమ్మిన వాళ్ళనీ ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటుంది.
తన జీవితాన్ని సైతం వాళ్ళ కోసం త్యాగం చేయగలదు.
అలాంటి మహిళను పురుషుడునే ఒకే ఒక్క కారణంగా గర్వాంధంతో మధమెక్కి హింసకు గురిచేస్తాడు. క్రూరంగా, జంతువులా ప్రవర్తిస్తాడు. ఆడది కలువ లాంటిది. చల్లని చంద్రుడు దొరికితే ఆరాధిస్తూ, చల్లని వెన్నెలలో హాయిగా జీవితం గడుపుతుంది. అదే మండే సుర్యుడు భర్తగా వస్తే నిస్సహాయంతో కుంగిపోతుంది. అటువంటి సున్నితమైన మనస్కులను అనంత ఘోరాలకు గురిచేస్తున్నారు.
ఇవన్నీ ఆలోచిస్తూ ఉండగా హఠాత్తుగా ఆటో ఆగింది .
మా ఇళ్ళు లాంటి అనాథాశ్రమం వచ్చింది. అదే ఆలోచిస్తూ ఉన్నాను. నిద్ర కూడా సరిగా పట్టలేదు.
మళ్ళీ లేచి స్కూలుకు బయలుదేరాను.
ఉదయం ఎంతో ప్రశాంతంగా ఉంది.
విచిత్రంగా ఉంది.
నాలో ఏదో కొత్తగా ఉంది.
గొంతు ఏదో కొత్త రాగాన్ని ఆలాపిస్తుంది.
మనసు ఏదో మౌనాన్ని అనుభవిస్తుంది.
నాకు ఎందుకో కొత్తగా ఉంది.
ఏమో అర్థంకావట్లేదు. నా మనసు చంచలంగా ఉంది.
నేను నా పాఠశాల కు వెళ్ళాను.
నా సీతాకోకచిలుకలూ, డిసెంబర్ పూలూ, వేపాకులూ ఆహ్లాదంగా పలకరించాయి.
నాకళ్ళలోఎందుకో విజయ దరహాసం తొణికిసలాడుతోంది. . వేదిక చాలా బావుంది.
ఈ రోజు ఆగష్టు 15, చూస్తూండగానే సభ మొత్తం నిండుకుంది.
అందరూ ఒకే జాతి వారులా ఒకే యూనిఫారములో ఉండడంతో కనువిందు చేస్తుంది సభ. వేదికనలంకరించారు పెద్దలు. ప్రసంగాలు..... ఆర్భాటాలూ, ,,,,,
సంగీత కచేరీలూ.... జరుగుతున్నాయి.
ఏవి నామనసును ఆనందింపజేయట్లేదు.
నా మనసు ఇంకా ఏదో ఆనందం కోసం ఎదురుచూస్తుంది. ఆకస్మాత్తుగా, ఆశ్చర్యంగా, ఆనందంగా, ఆహ్లాదంగా, ఆలోచితంగానో, అనాలోచితంగానో నా పేరును వేదికపై ఆహ్వానించారు.
నేనో కాదో అని అనుమానపడ్డాను. కాని నన్నే పిలిచారు. పాట పాడడానికి. ...
నా మనసు కోలుకోవట్లేదు. వేదికనెక్కాను. ఎన్నో కళ్ళు నా పాట కోసం వేచిచూస్తున్నాయి. ఎన్నో శ్రవణేంద్రియాలు నా పాటకై ఉవ్విళ్ళూరుతున్నాయి. కోలుకున్నాను. పాట మొదలు పెట్టాను.
ఆ........... ఆ..............
"వక్రతుండ మహాకాయ
కోటిసూర్య సమప్రభ
నిర్విఘ్నం కురుమేదేవ
సర్వకార్యేషు సర్వదా....... ఆ.....
.................................................
................................................
రెండు నిముషాలు అందరి మనసులు ఆకట్టుకోవాలని నా శాయశక్తులా పాడాను.
నాకు నచ్చింది.....
కరతాళ ధ్యనులు ...నా మనసులో మోగాయి.
ఇంతలో అటుగా వెళ్తున్న ఒక కారు ఆగింది.
చాలా పెద్ద సంగీత దర్శకులు నా దగ్గరకు వచ్చి "నా సినిమాలో పాడతావా, అమ్మా!" అన్నారు.
నా మనసు కోరుకున్న ఆనందం దొరికింది.
చాలా రోజులుగా నేను అనుభవించిన క్షోభ ....ఒక్కసారిగా కట్టలు దాటుకొని కన్నీరుగా బయటపడింది. నమ్మలేక పోయాను. "కానీ నిజానికి జీవితం చాల గొప్పది".
***
10 సంవత్సరాల తరువాత.
***
నేనిప్పుడొక పెద్ద గాయకురాలిని.
ఎంతో మంది మహిళలను గాయనిలుగా మార్చాను.
జీవితం సార్థకమైంది. ఇంకా నా ప్రాణం ఉన్నంతవరకు స్త్రీలను కాపాడతాను.
నేను జీవితంలో ఎదుర్కున్న ప్రతీ కష్టసమయంలో చావాలానుకొని చచ్చి ఉంటే
ఈ విజయం దక్కి వుండేది కాదేమో. ......
జీవితం విలువైనది. చాలా చాలా విలువైనది.
ఇప్పడికైనా కళ్ళుతెరిచి నిజాన్ని చూడండి. స్త్రీలను రక్షించండి.
రక్షించకపోయినా కనీసం కళ్ళముందు
అన్యాయం జరిగినపుడు కళ్ళప్పగించి చూడొద్దు.
వారి గొప్ప జీవితాన్ని మీ చేతులార అంతం కానివ్వకండి.
వారి ప్రతిభను గమనించడంలో ఆలస్యం చేయద్దు.
అనాథలనూ, స్త్రీలనూ అపహాస్యం చేయద్దు.
{దయచేసి పాటించండి. }
_____సిరికొండ మాధవి
రాజీవ్ గాంధి సాంకేతిక వైజ్ఞానిక విశ్వవిద్యాలయం .....బాసర .
మా విద్యాణిముత్యం రాసిన ఈ కథను యథాతధంగా ఇక్కడ ప్రచురిస్తున్నాను.
దయచేసి తప్పులు ఎంచకుండా మీ అభిప్రాయాలు తెల్పండి .
Sunday, February 7, 2010
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment