రవీంద్రభారతి.......
సన్మానసభ జరుగుతుంది.
ఆ సభలో సన్మాన గ్రహీతను ప్రతీఒక్కరూ ప్రశంసిస్తున్నారు.
పూల దండలు,శాలువాలతో సత్కరిస్తున్నారు.
ఇంతకీ అ సన్మాన గ్రహీత పేరు జయశ్రీ.
ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతుంది. ......
***
జయశ్రీ చిన్నప్పటినుంచి చాలా గారాబంగా పెరిగింది.ఒక్కగానొక్క కూతురు.ఎదుటివారిని అర్ధం చేసుకుంటూ,వారిని నొప్పించకుండా ప్రవర్తించే గొప్ప సంస్కారవంతురాలు.జంతుప్రేమ చాల ఎక్కువ.
ఒక చిన్న కుక్కపిల్లని పెంచుకోవాలని ,దానితో రోజూ ఆడుకోవాలని తన సరదా.
కానీ తన తండ్రికి అలాంటివి నచ్చవు.అలాంటి జయశ్రీ ఒకరోజు............................................
తన స్కూటీ మీద కాలేజికి వెళ్లి వస్తుంటే దారిలో ఒక తెల్లని పావురం కరెంటు తీగల మధ్యన చిక్కుకొని అల్లడిపోతుంది.
దానిని చూసిన జయ మనస్సు బాధతో విలపించింది.
ఇంటికి వెళ్లి "అమ్మా! బూజు కర్ర ఎక్కడ ఉంది?
అని అడిగి దానిని తీసుకెళ్తుంటే,వాల్ల అమ్మ" ఇప్పుడు దానితో నీకేమవసరం వచ్చింది?"
అని ప్రశ్నిస్తుంది.జరిగిందంతా చెప్పి బయటకి తన స్నేహితురాలు గౌతమిని తీసుకొని వెళ్తుంది.
అక్కడికి చేరుకున్నాక స్కూటీ మీద నిల్చుని తన శాయశక్తులా ప్రయత్నించి దానిని కాపాడుతుంది.
క్రింద పడిన పావురం ఒక్కసారిగా విదిలించుకుని స్వేచ్చగా ఎగిరివెళ్లి ఒక చెట్టుకొమ్మ మీద వాలుతుంది.దానిని సంతృప్తిగా చూస్తూ చున్నీతో చెమటను తుడుచుకుంటూ గౌతమితో
మాట్లాడుదామని ఇటు తిరిగేలోపు తన చెంపమీద దెబ్బ పడుతుంది కొట్టింది తన తండ్రి....!? కోపంగా.....
రోడ్డుమీద ఏంటా సర్కస్ ఫీట్సు?
దారిలో అంతమంది వెళ్తున్నా ఎవరికి లేని బాధ నీకెందుకు?
అంటూ తనని ఇంటికి లాక్కుని తీసుకొని వెళ్తాడు.
ఇలా జరిగిన కొద్దిరోజులకే మరొక సంఘటన జరిగింది.
***
ఆ రోజు ఆదివారం.జయశ్రీ ఫ్రెండ్స్ తో కలసి తన వీడియోకెమెరా తీసుకొని షికారుకు బయలుదేరుతుంది.పక్షుల యొక్క కిలకిలారాగాలు,అందమైన పూలమొక్కలు,ఇలాంటి ప్రకృతి సౌందర్యాలు ఆస్వాదిస్తూ,ఒక్కొక్క దాన్ని తన కెమెరాలో బంధిస్తుంది.
అలాంటి సమయంలో అక్కడ చెత్త కుండీలో పడి ఉన్నటువంటి ప్లాస్టిక్ బ్యాగుల్లోని ఆహారాన్ని అక్కడ పశువులు తింటున్నాయి.అందులో ఒక ఆవు యొక్క పొట్ట చాల లావుగా కనిపిస్తుంది.
ఆహారాన్ని తీసుకోలేక పోతుంది.దాని కళ్లు మూతపడిపోతున్నాయి.
సరిగ్గా రెండు నిముషాల తర్వాత ఆ ఆవు వున్నచోటునే కుప్పకూలిపోతుంది.
ఇదంతా గమనిస్తున్న జయశ్రీ ,గౌతమి మిగతా ఫ్రెండ్స్ అందరూ అక్కడికి చేరుకుంటారు.
తనకు తెలియకుండానే అదంతా రికొర్ద్ చేసింది.
వెంటనే దగ్గరలో వున్న పశు వుల డాక్టరుకు ఫోన్ చేసి జరిగినదంతా చెప్పి
అక్కడికి రమ్మంటుంది.
కాసేపటి తర్వాత ఆ డాక్టర్ వ్యానుతో సహా వచ్చి దానిని తీసుకొని హాస్పిటలుకు వెళ్తారు.
వారితో పాటు గౌతమి,జయశ్రీ కూడా వెళ్తారు.
అక్కడ హాస్పిటల్ లో ఆవును పరీక్షించిన తర్వాత డాక్టర్ ఆ ఆవు మరణించినట్లుగా నిర్దారించి వీళ్లిదారికీ చెప్పారు.
ఆ వార్త విన్న జయశ్రీ అసలు ఎందుకిలా జరిగిందని అతన్ని అడుగుతుంది.అప్పుడు ఆ డాక్టర్ "ప్లాస్టిక్ అనేది చాల చౌకగా దొరుకుతుందని మనం విరివిగా ఉపయోగిస్తుంటాము.కాని దానివల్ల మనకు తెలియకుండానే మనం హానికి గురి అవుతున్నాము. ఆ ఆవు విషయంలో కూడా అదే జరిగింది.రోజూ అలా ప్లాస్టిక్ బ్యాగుల్లోని ఆహారాన్ని తింటూ ఒక్కోసారి ప్లాస్టిక్ కవర్లను కూడా ఇవి తింటాయి.అవి జీర్ణం కాక కడుపులోని ప్రేగుల్లో నిలువగా ఉండిపోతాయి.కాబట్టి జీర్ణ శక్తి తగ్గిపోతుంది.
ఆ ఆవు విషయంలో మరొక దురదృష్ఠం ఏమిటంటే ఇది ప్లాస్టిక్ కవర్లతో పాటు అందులో మనం పడవేసే గాజుముక్కల్ని కూడా తిన్నది.
ఆ గాజుముక్కలు ఇప్పుడు గుండెకు గుచ్చుకొని చివరకు అది చనిపోయేలా చేసాయి. "అంటూ వివరించాడు. ఇదంతా రికార్ద్ చేసింది.చాలా బాధ పడింది."
మళ్లీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తన వంతు సహాయం చేయాలి
ఆ మూగ జీవాలకు ,అని ధృడంగా నిశ్చయించుకుంది.
తన నిర్ణయం గౌతమికి చెప్పింది.
తను కూడా సంతోషంగా ఒప్పుకొని ఆలోచన చేయసాగారు...............
***
ముందుగా జయశ్రీ గౌతమి వాళ్ల అమ్మను కలిసి తన పధకం చెప్పింది.
ఆమె సూపర్ మార్కెట్ నడుపుతుంది.ఆమె తన బిజినెస్ పాట్ నర్ని కలిసి ఆ విషయం చెప్పింది.వాళ్లందరికీ ఒక ఫంక్షన్ హాలు పేఇరు చెప్పి,అక్కడికి రమ్మని చెప్పింది.తను, గౌతమి ఇద్దరు కలిసి ఆ చుట్టుప్రక్కల వున్నా వర్తకులకు,వ్యాపారులకు విషయం చెప్పి అక్కడికి రమ్మని చెప్పరు.
ఒక చిన్న ప్రాజెక్ట్ అద్దెకు తీసుకొని కాలేజికి ఒక రోజు సెలను పెట్టి అనుకున్న రోజుకు ఫంక్షన్ హాలుకు వెళ్లారు.ఒక్కొక్కరూ వస్తున్నారు.దాదాపుగా 50 మంది వచ్చారు.ప్రొజెక్టర్ కనెక్ట్ చేసి తను రికార్డ్ చేసినదంతా చూపించింది దృష్యాలు చూసినంతసేపు హాలంతా నిశ్శబ్దం అమలుకుంది.
తర్వాత "మనం ఈ మూగజీవాలపైనే ఆధారపడి బ్రతుకుతాం. అలాంటి అవి మన చర్యల వల్ల నిస్సహాయంగా ప్రాణాలు కోల్పోతున్నాయి.దయచేసి అందరూ ఆలోచించండి."
అని వారికి చెప్పింది.ఎవ్వరూ కూడా మారుమాట్లాడకుండా వెళ్లిపోయారు.
ఏమైందో అర్ధంకాక తను నిస్సహాయస్థితిలో కూలబడిపోయింది.
వారం రోజుల తర్వాత...." ప్లాస్టిక్ వాడకం నిర్మూలనపై విద్యార్ధిని కృషి" అంటూ పేపర్ లో ప్రకటన చూసిన వారందరూ కలిసి ఒక సమూహంలాగ ఏర్పడి గోనెసంచులు తయారుచేసే ముడిపదార్ధాలతో బ్యాగులు తయారు చేసే ఒక చిన్న సంస్థను స్థాపించారు.కాలక్రమేణా అది మరింత అభివృద్ధి చెందింది.
***
కాలేజి నుంచి ఇంటికి వచ్చిన జయశ్రీకి ఇళ్లు తాళం వేసి కనిపించింది.
అప్పుడు పక్కింట్లో వుండే వనజ ఆంటీ వచ్చి "మీ నాన్నగారికి ఆఫీసు నుండి వస్తుంటే
యాక్సిడెంట్ అయిందంట ఇప్పుడే కబురొస్తే మీ అమ్మ ఏడుస్తూ వెళ్లింది.
అనగానే స్కూటీ తీసికొని బయల్దేరింది.బెడ్ మీద నిస్సహాయస్థితిలో పడివున్న
తన తండ్రి చూడగానే పరిగెత్తుకుంటూ వెళ్లి తండ్రి మీద పడి ఏడుస్తూ వుండిపోయింది.
ఇంతలో లేచిన తన తండ్రి రాఘవ " నాకు ఇలా జరగాల్సిందేనమ్మమ్!
ఆ రోజు పావురాన్ని కాపాడిన నిన్ను అంతమందిలో కొట్టి ,అంతమంది వుండగా నీకెందుకు?
అని తిట్టాను.ఈ రోజు పావురం స్థానంలో నేను రోడ్డు మీద రక్తం మడుగులో పడివున్న నన్ను చూసి, నాకెందుకులే అనుకొని ప్రతీఒక్కరూ అలాగే చూస్తూ వెళ్లిపోయారు.కానీ ఎవరో నీలాంటి మహానుభావుడు ఇక్కడ చేర్పించారు.లేకపోతె ఈ పాటికి...... అంటూ కూతురు చేయి పట్టుకొని ఏడవటం మొదలుపెట్టాడు.ఇంతలో మళ్లీ తేరుకొని " నీకొక గుడ్ న్యూస్ అంటూ ఆ సంస్థ గురించి చెప్పాడు."
దాంతో సంతోషంగా" నిజమా డాడి! వాళ్లందరూ ఆ రోజు మౌనంగా వెళ్లిపోయేసరికి కోపంలో వెళ్లారేమో అనుకున్నాను. నేఇని నమ్మలేకపోతున్నాను." అంది. అంతేకాదమ్మా!
ఆ సంస్థ ఏర్పడటానికి మూలకారణం నువ్వని తెలిసుకుని నీకు సన్మానం చేదామనుకుంటున్నారంట
అది చెబుదామనే నీ కోసం వస్తుంటే ఇలా జరిగింది అన్నడు కూతుర్ని దగ్గరకు తీసుకుంటూ......
***
సన్మానగ్రహీత అయినటువంటి జయశ్రీ ఇంటర్ ద్వితీయ సంవత్సరం డిస్టింక్షన్ లో పాస్ అయింది.
ఆ రోజు జయశ్రీ కి ఒక పార్సల్ వచ్చింది." నాకెవరు పంపిచ్చారబ్బా ?
అనుకుంటూ తెరిచేసరికి తన కళ్లని తానే నమ్మలేకపోయింది.
అట్టపెటెలో తెల్ల్లగా వున్నటువంటి బుజ్జి కుక్కపిల్ల బయటకు వచ్చింది మూలుగుతూ..."
అక్కడ పంపినవారి అడ్రస్ చూస్తే తన తంద్రి పేరు కనిపించింది.
జన్మదిన శుభాకాక్షలతో నీ తండ్రి అని...............
పి.రాధిక [ B081209]
Class room-32.
Monday, February 8, 2010
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment