Popular Posts

Monday, February 22, 2010

రాఘవహారి కీర్తనలు


రాఘవహారి కీర్తనలు
రచన :-కె.పి.రాఘవేంద్ర
I.D.B081623

2).పల్లవి:-జీవనజ్యోతి మనసు వేదికై
మమతలు పంచే జాతి నేస్తమై
ఒకరికి ఒకరు తోడుగ కలిసిక జీవనగమ్యం దాటాలి
మమతలు పంచుతు ఆదర్శంగా మెలగాలి
భరతరత్నవై నువ్వు భారతికే అందించాలి ........."జీవనజ్యోతి "
చరణం 1:-మదినే మంత్రమై, దేహంతంత్రమై
కాంతినే మించగా ,శాంతినే పరచగ
జాతినే నిలుపగ, భ్రాంతియేకలుగగా
మాతృభూమికిక మరుజన్మమే వెలగదా, మనస్సె పొంగదా ..............."జీవనజ్యోతి "
చరణం 2:-వలపే రాగమై,స్వప్నం స్నేహమై
కలిమితో ప్రాణియై, చెలిమె కలుగగ
ఉల్లాసం ఊపిరై, బ్రతుకె భారమై
జాతిసమైక్యతకి సహజీవం చెయ్యవా, సందేశం ఇవ్వవా ............"జీవనజ్యోతి "



3)పల్లవి:- సృష్టికే ఒక నిలయమైన భారతం.....
సృష్టికే ఒకదైవమైన భారతం ఇక తిరుగులేదోయ్.............." సృష్టికే"
చరణం 1:-మాతృభూమని మరచి అందరు మానవతనే చీల్చిరోయ్
భారతానికి తిరుగువున్నది భావిభారతపౌరులోయ్
భారతంలో ప్రజలు అందరూ భానిసలు కాకుడదురా
కడుపు చిల్చెకాని వానిని ఆగ్ని జ్వాలల తరమరా......" సృష్టికే"
చరణం 2:-హిమము రత్నకీరిటము ఆరవల్లి ఆభయహాస్తం
ఆంధ్రదేశము కాళ్ళకై పూభంతులుగ అయ్యెనా
కన్నతల్లి పుణ్య భువిలో మల్లి జన్మంకాననా
భారతానికి పుణ్యభూమని కీర్తినే ఇక దించెరా....." సృష్టికే"

కవితలు


1. మూగ బోయిన గోంతు ???
-కె.పి.రాఘవేంద్ర

సేవప్రయత్నపు పుట్టల్లోంచి
పరితపించె ఆత్మకు మరణం ఎక్కడిది ?
జీవనమే జ్యోతిగా,ప్రకాశించె
మనస్సును క్షణకాలం పాటు
రవికిరణం లాగా ప్రసరించే
సేవపూరిత హారితాంధ్రదాత!


పేద కడుపులలో రగిలే
కన్నిటి భాదలకు కృషించి
వర్షించె అన్నప్రదాత
అడుగడుగున నవతరాన్ని
కదిలిస్తూ చిరునవ్వులతో
అమృతవీణను వాయించిన
రాయలసీమ రారాజు................వై.ఎస్.రాజశేఖరుడు


మనోభావోద్వేగ సంకటిత పరంపర
పట్టుదల, విడవని శ్రమయే,
ద్యేయపూరిత, దేహానిశ్కల్మషంగా
అతని,వరహాస్తల్లొంచి జారువడిన
పథకపు జీవనద్దాలు .
జనజాగృతి కొరకు సైతం
కర్కశపాశాలను త్రెంచే ఆలోచనలతో
ప్రజలలోనిలిచిన జలయజ్ఞ సాగరుడు............వై.ఎస్.అర్


పేదల భాదల వలలో చిక్కి
అంతరాత్మ సరళి మరచి ముందడుగేస్తూ
ముఖ్యమంత్రి పదవి కదన రంగంలో
నలువైపుల చరిస్తూ తన
క్షేమానికి కూడా నోచుకోకుండా
క్షితి దాహానికి బలైపోయిన అమరుడు,ఆంధ్రరథసారథి...........వై.ఎస్.అర్

కఠోరనిర్వాహాణపు సంకెళ్ళ నుంచి
విముక్తులను చేస్తూ అపార భగిరతునివలే
బాలల భవిష్యత్తుకై విశ్వవిద్యలయ ములను
వేదిక చేసిన అపారవివేకవంతుడు...................వై.ఎస్.అర్


ఒకదేహముతో పరిపాలించి
మన ప్రాణములు నిలుపుటకై
పక్కాఇల్లనే రక్షణపు కవచాలుగ
నిర్మించిన ప్రాణదాత ............వై.ఎస్.అర్


విలయతాండవం చేస్తున్న
ఆంధ్రుల కన్నీటి ధారకు
నేడు ఏ ఆనకట్టలు ఆపలేవు
ఈ పౌరుష ప్రతిబింబాలు .
ప్రతి క్షణం సంతోశాలందించిన డాక్టర్.
అందుకు,
తన ప్రాణలను అందించి ,
మనోవేదనకు గురిచేసిన రాజశేఖరసార్వభౌమ.......వై.ఎస్.అర్

నే శోకించాను అటువంటి నేత రాలినందుకు ,
రాతలు అటువంటి నేతలకు అలా రాసినందుకు ,

జ్వలియించే ఉద్బోదనపు ఆవేశాలకు లోనవుతు మూగబోయిన నాఅంతరాత్మ సాక్షిగా
రగిలేకణకణాంతపు ఉజ్వల భవిష్యత్తుకు
నిరంతరాభిముఖంగా తెలియజేస్తున్న విశాదవార్త.
భాదతో సుశ్కించే నాహృదయం ,భయంతో వణికే నా కలంతో
తరుముతున్న నాగుండే, మాటలు రాని నా కవిత్వంతో నిరంతర జ్ఞాపకార్థం
హోయల లోతుల్లొంచి జనియించిన యశస్సు ఇది.




2. ఈనాటి సమాజానికి .....!!!!
-కె.పి.రాఘవేంద్ర


కావాలోయ్, కావాలోయ్
కావాలి, కావాలి ,
ప్రపంచానికి కావాలో విజేత
ఎటువంటివాడైన
మురికివాడైన , కఠినుడైన
స్వార్థపరుడైన, భుక్తిజీవైన

కావాలోయ్ ఈ ప్రపంచానికో విజేత
అణగద్రొక్కె నరరూప రాక్షసులు
భక్షించే క్రూర మృగాలు
ద్వేషపూరిత రాజకీయ కుట్ర
దారుఢ్యులు
కావాలోయ్, కావాలోయ్



కావాలోయ్ ఈ ప్రపంచానికో సమర్థుడు
అరాచకుడై, అసమర్థుడై నవారిని
దండించే వాడు ,
నయవంచితుడైన కునీతుడు

కావాలోయ్ ఈ ప్రపంచానికో శాసనధిక్కారి
ప్రకృతిచే శపించబడ్డవాడు
జనులను కబలించే కాలంతకులు

కావాలోయ్ ఈ ప్రపంచానికో భక్తి
పరులను భక్షించాలన్న ఏక భక్షుడు
మాటలతో మాయపుచ్చె కామరూపి

కావాలోయ్ ఈ నాటి సమాజానికి జ్ఞాని
లోలోపల వుంటూ లోకపు
నడతలను సంహరించేవాడు

కావాలోయ్ ఈ ప్రపంచానికో ఆణిముత్యాలు
ఇతలరులను దోచువాడు
దానిని నలువైపుల రక్షించుకొనే బ్లాక్ వ్యాపారులు .


3.స్నేహం

1. గుండె చాప్పుడు మరొకరికి
గుర్తుగా ఉండేటట్లు చేసేది స్నేహం
మనస్సులను కలిపే తన్మయం స్నేహం
సూర్యకిరణాలను చీల్చే మంత్రం స్నేహం
నిస్వార్థపు జీవితాల కలయిక స్నేహం
ఆపదలో ప్రాణాన్ని కూడ లెక్కచేయనిది నాస్నేహం

2. తియ్యని స్వరంతో పిలుపు అందించేది స్నేహం
కలకాలం తోడంటూ ఉంటూ నడిచేది స్నేహం
స్వార్థపు హస్తాలకు అందనిది స్నేహం
నిజం అనే నమ్మకానికి పునాది నాస్నేహం
వీడరాని కరిగిపోయి కలిసిపోయింది నాస్నేహం

3.కలిమిలేని లోభాలకు లొంగనిది నాస్నేహం
మంచి చెడ్డల మనిషిలోని నడవడిని
నేర్పే అతితమైన గ్రంథం స్నేహం
మందార మకరందాల మాధుర్యమే స్నేహం
స్నేహితుల మద్య చూసే కళ్ళల్లో ఉండేది స్నేహం
ఆప్యాయతల, అనురాగ మాళిక నాస్నేహం

4. ఒంటరి కాని జీవిత పయనం స్నేహం
తెలిసి తెలియని తరుణంలోని మాట్లాటపోట్లాటల
సముదాయం స్నేహం
తోడు లేని జీవితానికి పలకరింపే స్నేహం
క్షణం మారి నా, ఊపిరి ఆగినా, రాలి పడలేని మనస్సులోని కన్నీటిధార నాస్నేహం
శ్వాసపోసే ఆయుధం స్నేహం
విజయం
అందిచేది నాస్నేహం

5. సృష్టిలోని మనషులకు
నిలిచిపోయిన, నవరసాల
పల్లకిల మాటలను అందించే బందం స్నేహం
ఈ అనంత విశ్వంలో
పక్షిలా ఎగిరితే ఆశ్రయాన్నిస్తుంది స్నేహం
ఓర్పుతో నీడవలె వెన్నంటి ఉండేది స్నేహం

6. నీకోసం నీరీక్షణతో వేచియున్న అనేది స్నేహం
నవ్వుల చిరుజల్లు స్నేహం
ఆనందాలకు నిలయమైన అమృతవర్షం స్నేహం
గొప్పదంటూ మిగిలి, త్యాగం చేయించేది నాస్నేహం.....
స్నేహం అనే అమృతాన్ని ప్రతి ఒక్కరు త్రాగాల్సిందే అది వారికొక జీవిత గుణపాఠం.

రాఘవహారి కీర్తనలు
రచన :-కె.పి.రాఘవేంద్ర
I.D.B081623



కీర్తన-1
పల్లవి:-పాదాంబుజుడనీ పవళీకృతుడ సింగోటనారసింహా
గద్దెగోత్రాతూర్పింటివాసా లక్ష్మీనారసింహా
సత్యశ్రీ తనయ నవరసశోభ నరేశా.................. "పాదాం !!
చరణం 1:-యశస్కరీ శ్రీ కవితాబ్రహ్మా
శ్రీ వత్స తేజోధ్బావో నా తెలుగువీణ
పరిశోధకుడవు భవదివ్యుడవు
సంస్కృతీరూపా సుగుణీయచంద్ర ........"పాదాం !!
చరణం 2:- బంధుప్రియవాణి రచనోత్పాదక
నవయుగబ్రహ్మా నాదత్తరా
ఓంకారరూపా సర్వాణి శంభూ
కొల్లపూర్ వాస కారుణ్యరూపా........... "పాదాం !!
చరణం 3:- సద్సంగతుడవు ఆచార్యుడవు
ఆధ్యపనమే నీ తపఃశుద్ది ..
శరణను వారికి సర్వశ్రీరక్ష
కాముక ప్రియ భక్తవరద ..............."పాదాం !!

No comments:

Post a Comment